కేసీఆర్ తో తెగిపోయిన బంధం

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 12లోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసి ఆయన తెలంగాణలో కొనసాగేలా క్యాట్ మూడేళ్ల క్రితం ఉత్తర్వులిచ్చింది. నాటి నుంచీ ఆయన తెలంగాణలో సీఎస్‌గా కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017లోనే కేంద్రం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఇంతకాలానికి సోమేశ్‌కు కదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గతంలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్ట్ నేడు కొట్టేసిన నిమిషాల్లోనే సోమేశ్‌ను కేంద్రం రిలీవ్ చేయడం కలకలం రేపుతోంది. పైగా ఎల్లుండిలోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించడం దుమారం రేపుతోంది.

Leave a Reply

%d bloggers like this: