అస్కార్ అవార్డుల వేడుక ‘నాటునాటు’పాటకు ఊగిపోయిన థియేటర్

ఆస్కార్ అవార్డుల పండుగ మొదలైంది. ఆస్కార్స్‌కు నామినేట్ అయిన సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది అవార్డుల ఫంక్షన్‌కు హాజరయ్యారు. హాలీవుడ్ తారలు రెడ్‌కార్పెట్‌పై హొయలొలికించారు. బాలీవుడ్ నటి దీపిక, ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితరులు రెడ్‌కార్పెట్‌పై నడిచి ఫొటోలకు పోజిచ్చారు. ఇక, ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాట ప్రదర్శించగా, దానికి హాలీవుడ్ డాన్సర్లు చిందులేశారు. ఈ పాట ప్రదర్శిస్తున్నంత సేపు కరతాళ ధ్వనులతో థియేటర్ హోరెత్తిపోయింది. ఇక, ఇప్పటి వరకు ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సహాయనటుడు, బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్, ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డులను ప్రకటించారు.  ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమాకు గాను జేమ్స్ ఫ్రెండ్స్ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఉత్తమ సహాయనటుడిగా కే హ్యూ క్వాన్ అవార్డు అందుకోగా, ఈ ఏడాది ఉత్తమ లైవ్ షార్ట్‌గా ‘యాన్ ఐరిష్ గుడ్‌బై’కి అవార్డు దక్కింది. టామ్ బెరిక్లీ, రోజ్‌వైట్‌ ఈ అవార్డును అందుకున్నారు. ఇక, ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు ‘నవల్నీ’ సొంతమైంది.

Leave a Reply

%d