ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కళ్యాణ్ తొలి పోస్టు చూశారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకుని వారాహి యాత్రతో ఫుల్ బిజీగా ఉన్నారు. మధ్యలో కాస్త అనారోగ్యానికి గురయ్యారు. ఆ టైంలోనూ పార్టీ వర్గాల వారితో సమావేశాలు నిర్వహిస్తూ, ‘బ్రో’ మూవీ టీజర్ డబ్బింగ్ కంప్లీట్ చేశారు. పొలిటికల్ టూర్‌లో ప్రేక్షకాభిమానులకు, రాజకీయ నాయకులకు సరికొత్త పవన్ కళ్యాణ్‌ని చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి పోస్ట్ చెయ్యకుండా జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసి, అతి తక్కువ టైంలోనే 1 మిలియన్ ఫాలోవర్లతో రికార్డ్ సెట్ చేశారు. ఫ్యాన్స్, నెటిజన్స్ వరుస పెట్టి ఫాలో కొట్టడం మొదలెట్టారు. ప్రస్తుతం 2.4 మిలియన్ల ఫాలోవర్లున్నారు. అయితే శనివారం సాయంత్రం (జూలై 15) పవన్ ఫస్ట్ టైం ఇన్‌స్టాలో ఓ స్టోరీ పోస్ట్ చేశారు.

మొదట చూడగానే ఆయనేనా ఈ పోస్ట్ చేసింది అనుకున్నారు కానీ కన్ఫమ్ చేసుకున్నాక షాక్ అయ్యారు. ఫస్ట్ పోస్టే కాస్త ఎమోషనల్‌గా చేశారు పవన్. ‘మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ…’ అంటూ మెమరబుల్ వీడియో ఒకటి షేర్ చేశారు. ఇందులో తన ఫ్యామిలీ మొదలుకుని, సినిమాలకు సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ చాలా ఉన్నాయి. తన ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ మొదలుకుని, ఇప్పటి ‘బ్రో’ వరకు, దాదాపుగా ఏ చిన్న జ్ఞాపకాన్ని కూడా వదలకుండా చూసుకున్నారు. మధురమైన క్షణాలన్నిటినీ ఫోటోల రూపంలో దాచుకోవడం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో వాటికి వీడియో చేయడం ఆకట్టుకుంటుంది.

పవన్ ఈ పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతుంది. వ్యూస్, లైక్స్, కామెంట్స్ భారీగా వస్తున్నాయి. ఇక తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన ‘బ్రో’ మూవీ టీజర్‌లో వింటేజ్ పవన్‌ని చూడబోతున్నారని హింట్ ఇచ్చారు. ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. జూలై 28న సినిమా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ‘హరి హర వీరమల్లు’ కూడా దాదాపుగా పూర్తికావొచ్చింది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇటీవలే సెట్స్‌పైకెళ్లింది.

Leave a Reply

%d bloggers like this: