ఢిల్లీలో నిరాహార దీక్షకు కవిత స్కెచ్

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష చేయబోతున్నారు. 2023, మార్చి 10వ తేదీ ఢిల్లీలో ఈ దీక్షకు రెడీ అవుతున్నారు. దేశ రాజధాని జంతర్ మంతర్ దగ్గర.. ఒక్క రోజు దీక్షకు దిగుతున్నారు. భారత్ జాగృతి ఆధ్వర్యంలో.. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ పై ఈ దీక్ష చేపట్టనున్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లును సభలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మెల్సీ కవిత దీక్షకు దిగుతున్నారు. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ తోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఎంపీ సీట్లను పెంచాలని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు కవిత. బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం జనాభా లెక్కలు కూడా చేయలేదన్నారు. బీసీ జనాబా లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ ప్రకారం ఎవరి హక్కులు వాళ్లకు రావాలని స్పష్టం చేశారు.

Leave a Reply

%d bloggers like this: