ప్రియుడి కోసం బిడ్డతో సహా ఇండియా వచ్చేసిన మరో విదేశీ మహిళ

ప్రేమ కోసం మరో విదేశీ మహిళ పిల్లలతో భారత్ వచ్చేసింది. పోలాండ్‌కు చెందిన పోలాక్ బార్బరాకు(45) ఝార్ఖండ్‌కు చెందిన మహ్మద్ షాదాబ్(35)‌తో 2021లో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. బార్బరాకు అప్పటికే వివాహమై ఓ బిడ్డ(6) కూడా ఉన్నారు. కాగా, మహ్మద్‌తో పోలాక్‌తో పరిచయం ప్రేమగా మారడంతో ఆమె ప్రియుడితో కలిసి ఉండేందుకు నిర్ణయించింది. భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. కొద్ది రోజుల క్రితం ఆమె తన బిడ్డతో సహా హజారీబాగ్‌లోని ప్రియుడి స్వగ్రామమైన ఖుత్రాకు వచ్చేసింది. ప్రస్తుతం అతడితో కలిసి ఉంటోంది.

అయితే, ఇక్కడి వేడిని పోలాక్ తాళలేకపోవడంతో మహ్మద్ ఆమె కోసం ఇంట్లో ఓ ఏసీ కూడా ఏర్పాటు చేశాడు. మరోవైపు తన ప్రేమను సాకారమైనందుకు ఆమె హర్షం వ్యక్తం చేసింది. ‘‘భారత్ చాలా అందమైన దేశం, ఇక్కడి ప్రజలు ప్రేమ గలవారు. నన్ను చూసేందుకు రోజు వందలాది మంది వస్తున్నారు’’ అని ఆమె చెప్పింది. కాగా, ఖండాంతర ప్రేమ వ్యవహారంపై హరీబాగ్ జిల్లా డీఎస్‌స్పీ రాజీవ్‌కుమార్ కూడా ఆరా తీశారు. ఖుత్రా గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. ‘‘నేను పోలాక్‌తో మాట్లాడాను. మరికొద్ది రోజుల్లో ఆమె పోలాండ్ వెళ్లనుంది. ఆ తరువాత షాదబ్‌కు వీసా వచ్చాక అతడినీ తనతో పోలాండ్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది’’ అని ఆయన తెలిపారు.

Leave a Reply

%d