మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి

భారత్ రాష్ట్ర సమితి (భారస)పై మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు పొంగులేటి. ఇప్పటకే పార్టీని ఎదురించి తన మద్దుతు దారులను కూడగట్టుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అన్ని ప్రాంతాలను కలియదిరుగుతూ ఆత్మీయ సభలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇవాళ  ఓ సమావేశంలో మాట్లాడుతుంటే భారస అధిపతికి దమ్ము ఉంటే తనని పార్టీని నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకానీ ఉకదంపుడు ఉపన్యాసాలకు ఏవరూ భయపడేది లేదన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలను ఏ పార్టీలో చేరాలని నిర్ధేశిస్తే ఆ పార్టీలో చేరుతానని లేదంటే సొంతంగా పోటీ చేస్తానని వెల్లడించారు.  పొంగులేటి వ్యవహారంపై ఆగ్రహాంగా ఉన్న గులాబీ అధిపతి ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకుంటారో వేచి చూడాలి మరీ.

 

Leave a Reply

%d bloggers like this: