కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం తో అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సహం నెలకొంది. ఈ విజయం తో మిగతా రాష్ట్రాల్లో కూడా మరింత పట్టు బిగిస్తున్నారు. ఇక తెలంగాణ లో కూడా కర్ణాటక విజయం తో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లు కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
For More News Click: https://eenadunews.co.in/
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న కాంగ్రెస్ గూటికి చేరే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించగా.. ఇవాళ వనపర్తిలో మంత్రి నిరజంన్ రెడ్డి టార్గెట్‌గా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ సమావేశాలతో బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో ఏకతాటిపైకి తీసుకురావాలనేది పొంగులేటి, జూపల్లి వ్యూహంగా తెలుస్తోంది. ఇక పొంగులేటి కాంగ్రెస్ లో చేరే విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.