ప్రభాస్ అనారోగ్యానికి గురైనాడా ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ …ప్రస్తుతం అనారోగ్యం తో బాధపడుతున్నాడా..? ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో , సోషల్ మీడియా లో ఇదే చర్చ నడుస్తుంది. బాహుబలి , సాహో చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్..ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ చేతిలో ఆదిపురుష్ తో పాటు మరో ఐదు సినిమాలు ఉన్నాయి. వాటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మారుతితో హారర్ కామెడీ చిత్రంగా ‘రాజా డీలక్స్’ ఉండగా.. ఇటీవలే మరో బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నామని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత యెర్నేని నవీన్ తెలిపారు. దీంతో ప్రభాస్ చేతిలో మొత్తంగా ఆరు సినిమాలు ఉన్నాయి. వీటిలో మూడు సినిమాలను ఎంత త్వరగాయితే..అంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని ట్రై చేస్తున్నాడు. దీంతో సరిగా నిద్ర , తిండి లేక అనారోగ్యానికి గురయ్యాడని తెలుస్తుంది. ప్రభాస్ అస్వస్థత కారణంగా సినిమా చిత్రీకరణలపై ప్రభావం పడనుంది. మూవీ షూటింగ్ లపై ఎఫెక్ట్ పడితే వాటి విడుదల విషయంలో కూడా జాప్యం జరగనుంది. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తయింది. కాబట్టి ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి ప్రభావం పడకపోవచ్చు. కానీ సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్ సినిమాల షూటింగ్ కు మాత్రం బ్రేక్ పడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మరి ప్రభాస్ అనారోగ్యానికి గురయ్యాడనే వార్తల్లో ఎంత నిజం ఉందనేది అధికారికంగా ప్రకటన వస్తే కానీ తెలియదు.

Leave a Reply

%d