ప్ర‌గ‌తి ఆంటీ కొత్త అవతారం

సీనియ‌ర్ న‌టి ప్ర‌గ‌తి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈమె చాలా తెలుగు సినిమాల‌లో న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకుంది. హీరోలు, హీరోయిన్లకి తల్లిగా, అత్తగా నటిస్తూ అభిమానుల మ‌న‌సులు కొల్ల‌గొట్టింది. ఎఫ్ 2 చిత్రం మెహ్రీన్, త‌మ‌న్నాల తల్లిగా తెగ సంద‌డి చేసింది. అయితే ప్ర‌గ‌తి ఇటీవ‌ల సినిమాల క‌న్నా కూడా సోష‌ల్ మీడియా ద్వారా నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంది. డ్యాన్స్ వీడియోలు, వ‌ర్క‌వుట్స్ వీడియోలు త‌ర‌చూ షేర్ చేస్తూ తెగ సంద‌డి చేస్తుంది ప్ర‌గ‌తి. అయితే ఇప్పుడు ప్ర‌గ‌తి వెయిట్‌ లిఫ్టింగ్ రంగంలోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో షేర్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది.

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నానంటూ ఓ వీడియోని త‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఇందులో వెయిట్‌ లిఫ్టర్‌ డ్రెస్‌ ధరించి, వ‌ర్క‌వుట్స్ చేస్తూ చాలా స్టైలిష్‌గా క‌నిపించింది..రెండు నెలల క్రితం నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేదు. పవర్ లిఫ్టింగ్‌ లో ఇది నాకొత్త ప్రయాణం అని చెప్పుకొచ్చింది.. రెండు నెలల క్రితం ఈ జర్నీ మొదలుపెట్టిన నేను త‌ప్పక పూర్తి చేసి తీరతానని కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు తన స్కోరు 250 అని, అయితే టార్గెట్ చాలా పెద్దదే, అయినా దాన్ని చేరేవరకు ప్రయత్నిస్తూనే ఉంటాను అని చెప్పడం విశేషం.

ఇక ఈ వీడియోని త‌న‌ని పవర్ లిఫ్టింగ్ వైపు ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు చెబుతూ కొందరిని ట్యాగ్ చేసి షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ముందు షాకైన‌ప్ప‌టికీ తర్వాత ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతుండటం విశేషం. వీడియో చూస్తుంటే ప్ర‌గ‌తి బాగానే క‌ష్ట‌ప‌డుతున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. సాధార‌ణంగా ఆర్టిస్ట్‌లు చాలా సుకుమారంగా, సెన్సిటివ్‌గా ఉంటారు. కాని ప్ర‌గ‌తి మాత్రం అంద‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఒక‌వైపు త‌న అందాలు చూపిస్తూ మ‌రోవైపు వ‌ర్క‌వుట్స్‌తో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

Leave a Reply

%d