అడవి బాట పట్టిన మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని బండీపుర టైగర్‌ రిజర్వును సందర్శించారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడిస్తూ టైగర్‌ రిజర్వుకు చెందిన పలు ఫొటోలను ట్విటర్లో పంచుకొన్నారు. ”రమణీయమైన బండీపుర టైగర్‌ రిజర్వులో నేటి ఉదయం గడిపాను. భారత దేశ ప్రకృతి సౌందర్యాన్ని, వన్యప్రాణుల వైవిధ్యాన్ని ఆస్వాదించాను” అని పేర్కొన్నారు. ఈ టైగర్‌ రిజర్వులో దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి అటవీ అందాలను ప్రధాని ఆస్వాదించారు. ఖాకీ ప్యాంట్‌, కామోఫ్లాజ్‌ టి-షర్ట్‌, స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించిన మోదీ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. తెప్పకాడు ఎలిఫెంట్‌ క్యాంప్‌ వద్ద ప్రధాని ఏనుగులకు చెరకుగడలను ఆహారంగా ఇచ్చారు. ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకున్న ‘ఎలిఫెంట్ విష్పరర్స్‌’ డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్‌, బెళ్లి దంపతులు, అందులో కనిపించిన ప్రతినిధులు, నిర్మాత దర్శకులు, మావటిలతో ముచ్చటించారు.

 

 

Leave a Reply

%d