ఆ సీన్ చేసేటప్పుడు అక్కడ చేయి అడ్డుపెట్టుకున్న

శృంగార సన్నివేశాల్లో హీరోయిన్స్ చాలావరకు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. వాటి గురించి పెద్దగా మాట్లడరు. అలాంటిది హీరోయిన్ ప్రియాంక చోప్రా.. బోల్డ్ కామెంట్స్ చేసింది. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.

ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఆమె గురించి మన ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. కొన్నాళ్లకు బాలీవుడ్ లో స్టార్ అయిపోయింది. కొన్నేళ్లపాటు తన క్రేజ్ తో ఎంటర్ టైన్ చేసింది. ఆ తర్వాత అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ని పెళ్లి చేసుకుని, యూఎస్ లో సెటిలైపోయింది. ప్రస్తుతం పలు హాలీవుడ్ సినిమాలు, సిరీస్ ల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రియాంక చోప్రా నటించిన కొత్త సిరీస్ ‘సిటాడెల్’. ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో చురుగ్గా పాలొంటోంది. ఇందులోని శృంగార సన్నివేశాల గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అసలు విషయానికొస్తే.. ఒకప్పటితో పోలిస్తే ఇప్పడు ట్రెండ్ మారిపోయింది. సినిమాల్లో కాస్త అదుపులో ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఓటీటీ కంటెంట్ లో మాత్రం రెచ్చిపోతున్నారు. విచ్చలవిడిగా శృంగార సన్నివేశాలు ఉంటున్నాయి. బయటకు వీటపై విమర్శలు చేస్తున్నా, చాలామంది వీటిని చూసి ఎంజాయ్ చేసేస్తున్నారని అనిపిస్తోంది. ఇండియన్ వెబ్ సిరీస్ ల్లోనే అస్సలు తగ్గట్లేదు. అలాంటిది ఇంగ్లీష్ సిరీసుల్లో తగ్గే ఛాన్స్ లేదు. తాజాగా ‘సిటాడెల్’లోనూ అలాంటి సీన్స్ బోలెడన్నీ ఉంటాయని నటి ప్రియాంక చోప్రా మాటలు వింటుంటే అనిపిస్తోంది. ‘సిటాడెల్ సిరీస్ లో బోల్డ్ సీన్స్ చాలానే చేశాం. వాటి షూటింగ్ టైంలో రిచర్డ్, నేను ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకున్నాం. కొన్ని ఇబ్బందికర యాంగిల్స్ లో నటించాల్సి వచ్చింది. అప్పుడు బాగా అసౌకర్యంగా ఫీలయ్యాం. కెమెరాలో మా బాడీ పార్ట్స్ కనిపించకుండా చేతులతో కవర్ చేసుకునేవాళ్లం. రిచర్డ్.. బాడీ కనిపించకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పేవారు. దీంతో ఎలాంటి ఒత్తిడికి ఫీలవుకుండా బోల్డ్ సీన్స్ కంప్లీట్ చేశాం’ అని ప్రియాంక చెప్పింది. ఇదిలా ఉండగా ‘సిటాడెల్’ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో సమంత లీడ్ రోల్ చేసింది. ప్రియాంక చెప్పిన ప్రకారం చూస్తే.. సమంత కూడా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయింటుంది అనిపిస్తోంది. సిరీస్ రిలీజ్ అయితే గానీ అసలు విషయం తెలియదు.

Leave a Reply

%d bloggers like this: