కర్ణాటకలో విజయంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే తెలంగాణాలో ఓ మోస్తరుగా బలాన్ని కలిగి ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు దాన్ని ఇనుమడింపజేసేందుకు సిద్ధం అవుతోంది. వాస్తవానికి తెలంగాణాలో కేసీఆర్ జోరును అడ్డుకుని అధికారాన్ని చేపట్టేందుకు అటు కాంగ్రెస్, ఇక బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆమధ్య హుజూరాబాద్ లో ఈటెల గెలుపుతో జోరుమీదున్న బీజేపీకి మునుగోడు ఉప ఎన్నిక బ్రేక్ వేసింది ఇక కర్ణాటక ఎన్నికల్లో గెలుపు ద్వారా ఆ జోష్ మళ్ళీ తెలంగాణాలో కంటిన్యూ చేద్దాం అని అనుకున్నారు కానీ అక్కడ ఫెయిల్ అవడంతో తెలంగాణ బీజేపీ నాయకుల్లో కాస్త నైరాశ్యం ఆవహించింది. ఇదిలా ఉండగా కర్ణాటకలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో మాత్రం ఆత్మ విశ్వాసం పొంగిపొర్లుతోంది.
రాహుల్ గాంధీ, ప్రియాంక తదితరులు అక్కడ ప్రచారం చేసి కాంగ్రెస్ గ్రాఫ్ ను అమాంతం పెంచారు. బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ సిటీ ఉన్న కన్నడ రాజ్యాన్ని గెలిచిన తరువాత ఇప్పుడు తెలంగాణాలో పాగా వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఐతే అదే క్రమంలో ఇప్పుడు ప్రియాంక నేరుగా హైదరాబాద్ లో నివాసం ఉంటారని.. అప్పుడైతే క్యాడర్, ఇంకా ప్రజల్లో నమ్మకం.. ఓ అభిమానం ఎక్కువ అవుతాయని పార్టీ భావిస్తోందట. ఈ క్రమంలో ప్రియాంక కోసం ఒక మంచి ఫార్మ్ హౌస్ లేదా పెద్ద బంగాళా కోసం చూస్తున్నారని అంటున్నారు. ఆంటే ఈ ఏడాది అంతా ఆమె తన కుటుంబంతో తెలంగాణలోనే వుంటారన్నమాట.. కార్యకర్తలు నిత్యము రావచ్చు ఆమెను కలిసి, పార్టీ వ్యవహారాల మీద చర్చించొచ్చు అన్నమాట.. మొత్తానికి ప్రియాంక ఇక్కడే ఉంటూ పార్టీకి మరింత జవసత్వాలు ఇస్తారని క్యాడర్ అంటోంది. చూడాలి ఇది మరి.