గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు

గస్తీ విధులు గాలికి వదిలేసిన పోలీసులు మద్యం సేవిస్తూ చిక్కారు. మద్యం సేవిస్తూ అడ్డంగా దొరికి పోయారు  హైదరాబాద్ పంజాగుట్ట గస్తీ పోలీసులు. మూడు రోజుల క్రితం ఎర్రమంజిల్ గలేరియా మాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉండి మద్యం సేవిస్తూ అడ్డంగా బుక్కైపోయిన ఖాకీలపై ఉన్నతాధికారులు చర్యలకు చేపట్టారు.

గస్తీ గాలికి వదిలేని మద్యంతో చిల్ 

పంజాగుట్ట పోలీసులు గస్తీ గాలికి వదిలేసి చక్కగా చుక్క వేసుకుంటున్నారు. అర్ధరాత్రి కదా ఎవరూ రారనే ధైర్యంతో రోడ్డు పక్కనే సిట్టింగ్ పెట్టారు. రోడ్డు పక్కనే పెట్రోలింగ్ పోలీసు వాహనాన్ని అడ్డుగాపెట్టి మద్యం సేవిస్తున్నారు ఇద్దరు పోలీసులు. అటుగా వెళ్తున్న కొందరు పోలీసుల బాగోతాన్ని వీడియో తీశారు. దీంతో గస్తీ పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. పంజాగుట్ట ప్రాంతంలో రాత్రి పూట పెట్రోలింగ్ చేయాల్సిన పోలీసులు విధులను గాలికి వదిలేసి రోడ్డు పక్కన కూర్చొని మందేస్తూ ముచ్చట పెట్టారు. మంచింగ్ కోసం తెచ్చుకున్న చికెన్ ను ప్లేట్ పెట్టుకుని అది గాలికి ఎగరకుండా వాకీటాకీని బరువుకు పెట్టారు.  మద్యం బాటిల్ ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టారు. అయితే సేవిస్తున్న గ్లాసుల్లోని మద్యాన్ని దాచలేకపోయారు. వీడియోలో పోలీసులు మద్యం సేవిస్తున్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

ఉన్నతాధికారుల దృష్టికి 

ఈ ఘటన మూడు రోజుల క్రితం ఎర్రమంజిల్ గలేరియా మాల్ సమీపంలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించారు. విధుల్లో ఉండి మద్యం సేవిస్తూ దొరికిన పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు. విధుల్లో ఉండి రాత్రి పూట పెట్రోలింగ్ చేయాల్సిన పోలీసులు ఇలా మందు కొడుతూ ఉండడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

Leave a Reply

%d