వైజాగ్ లో పుష్ప2 షూటింగ్

‘పుష్ప’గా అల్లు అర్జున్‌ సృష్టించిన హంగామా తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర ఘన విజయాన్ని అందుకొంది. పాన్‌ ఇండియా స్థాయిలో రికార్డు వసూళ్లు అందుకొంది. ఇప్పుడు ‘పుష్ప 2’పైనే అందరి కళ్లూ. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. ప్రస్తుతం విశాఖపట్నంలో చిత్రీకరణ జరుపుకొంటోంది. అక్కడ ఓ యాక్షన్‌ సీన్‌ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. అక్కడి నుంచి తిరిగొచ్చాక హైదరాబాద్‌లో టాకీ మొదలవుతుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, అనసూయ, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘పుష్ప’ సూపర్‌ హిట్‌ అవ్వడంతో పార్ట్‌ 2పై అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టే ఈ చిత్రాన్ని ఖర్చుకు వెనకాడకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్టు సమాచారం.

Leave a Reply

%d bloggers like this: