రాహుల్ గాంధీకి ఊరట

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీపై పడిన రెండేళ్ల శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది సూరత్ సెషన్స్ కోర్టు. మేజిస్ట్రేట్ తీర్పుపై దాఖలు చేసిన అప్పీలుపై తుది నిర్ణయం వెలువడే వరకు శిక్షను సస్పెండ్ చేసింది.

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఊరట లభించింది. పరువు నష్టం (Defamation) కేసులో రాహుల్ గాంధీపై మేజిస్ట్రేట్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సూరత్ సెషన్స్ కోర్టు (Surat Sessions Court) తాత్కాలికంగా నిలుపుదల చేసింది. దోషిగా నిర్ధారిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పు, రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేయాలని సూరత్ సెషన్స్ కోర్టులో నేడు (ఏప్రిల్ 3) అప్పీలు దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ఈ అప్పీలుపై తుది నిర్ణయం వెలువడే వరకు జైలు శిక్షను నిలుపుదల (Suspend) చేసింది సెషన్స్ కోర్టు. రాహుల్ అప్పీలుపై తదుపరి విచారణను ఏప్రిల్ 13న చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఏప్రిల్ 13 తేదీ వరకు రాహుల్ గాంధీ బెయిల్‍ను పొడిగించింది.

Leave a Reply

%d