తొలకరి పులరిస్తోంది

నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకుని రాయలసీమలోకి ప్రవేశించాయి. సీమ, తెలంగాణా, దక్షిణ కోస్తాంధ్రలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కు తగ్గాయి. తమిళనాడులో కుంభవృష్టి కారణంగా ఆరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. చెన్నయ్ నగరంలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరానికి మంచినీటి సరఫరా చేసే చెంబరంబాకమ్ జలాశయానికి 921 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నాయి. నిన్న రాత్రి చెన్నయ్ విమానాశ్రయంలో దిగాల్సిన 9 విమానాలకు బెంగళూరుకు మళ్లించారు. 22 వరకు హైదరాబాద్, తెలంగాణా అంతటా రుతుపవనాలు విస్తరిస్తాయి. ఈ లోగా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Leave a Reply

%d