అందరికీ మినిమమ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి – రష్మీ

క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి యాంకర్ గా షోస్‌ చేస్తూ.. హీరోయిన్ గా కూడా తనని తాను నిరూపించుకుంది. ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌ యాంకర్‌ గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం. యాంకర్ గా కొనసాగుతూనే హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. టీవీ షోస్‌, స్పెషల్‌ ఈవెంట్స్ తో సందడి చేస్తుంటుంది. రష్మీ అటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా మూగజీవాల విషయంలో ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది. వాటికి ఎలాంటి హాని కలిగించవద్దని కోరుతుంటుంది. అలాగే సమాజంలో జరిగే చాలా విషయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ ఉంటుంది.

For More News Click: https://eenadunews.co.in/

సోషల్‌ ఇష్యూస్‌ పై రష్మీ తనదైనశైలిలో స్పందిస్తూ ఉంటుంది. నలుగురికి మంచి చెప్పాలని తాపత్రయ పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు సమాజంలో జరిగే ఘోరాలు, అన్యాయాలపై కూడా తన గళాన్ని విపిస్తూ ఉంటుంది. తాజాగా ఓ అమానవీయ ఘటనపై రష్మీ స్పందించింది. చెల్లికి రజస్వల అయితే.. ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకుని కొట్టి చంపేశాడు. చెల్లికి పిరియడ్స్ వచ్చాయన్న విషయం తెలియకుండా అన్న కొట్టి చపండంపై రష్మీ ఎమోషనల్ అయ్యింది. మినిమం సెక్స్‌ ఎడ్యుకేషన్ లేకనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంది. అందరికీ తప్పనిసరిగా సెక్స్‌ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పింది.

 

Leave a Reply

%d