గుండె జబ్బులతో స్టార్ హీరోయిన్ సతమతం

ఇటీవలి కాలంలో పలువురు హీరోయిన్లు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. సమంత, మమత మోహన్ దాస్ వంటి హీరోయిన్లు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా తన అనారోగ్యం గురించి వెల్లడించారు. తాను కొన్నాళ్లుగా గుండె, ఇతర సమస్యలతో బాధపడుతున్నానని… తనను దగ్గరగా చూస్తున్నవారికి ఈ విషయం గురించి తెలుసని చెప్పారు. వాటిని ఎదుర్కొనేందుకు కావాల్సిన శక్తిని కూడగట్టుకుంటున్నానని తెలిపారు.  తనకు ప్రస్తుతం చికిత్స జరుగుతోందని, మందులను వాడుతున్నానని, యోగా చేస్తున్నానని చెప్పారు. మంచి పోషక పదార్ధాలను ఆహారంగా తీసుకుంటున్నానని తెలిపారు. తనలా ఎవరైనా సమస్యలతో బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకే ఈ విషయాన్ని పోస్ట్ చేస్తున్నానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకూడదని సూచించారు. త్వరలోనే అనారోగ్యం నుంచి కోలుకుని షూటింగుల్లో పాల్గొంటానని తెలిపారు. అయితే కచ్చితంగా ఏ విధమైన అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారనే విషయాన్ని మాత్రం ఆమె స్పష్టంగా చెప్పలేదు.

Leave a Reply

%d