రోడ్డు ప్రమాదంలో ప్రధాని సోదరుని కుటుంబ సభ్యులకు గాయాలు

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ఇతర కుటుంబ సభ్యులు కర్ణాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రహ్లాద్ మోదీ తన కొడుకు, కోడలు, మనవడితో కలిసి ఓ ఎస్ యూవీ వాహనంలో బండిపుర వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మైసూరుకు 13 కిలోమీటర్ల దూరంలోని కడ్కోలా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న వాహనం అదుపు తప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొట్టింది. దాంతో ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులను మైసూరులోని జేఎస్ హాస్పిటల్ కు తరలించారు. ప్రహ్లాద్ మోదీ మనవడికి తలకు ఓ మోస్తరు గాయాలు కాగా, ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు.

Leave a Reply

%d