‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటి జ్యోతి రాయ్. తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది. అమ్మగా, భార్యగా, అక్కగా, ఎలాంటి పాత్రలైనా తన నటనతో అందరినీ అలరిస్తుంది. కన్నడలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని, తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన జ్యోతి రాయ్ ఇన్‌స్టాలో తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఈ ఫొటోస్ చూసి తన ఫాలోవర్స్ ‘ఇంత అందం పెట్టుకొని అమ్మ క్యారెక్టర్ చేయడం ఎందుకు?, మీరు హీరోయిన్ మెటీరియల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. తను ఓ యంగ్ డైరెక్టర్‌తో రిలేషన్‌లో ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ వంటి సినిమాలకు డైరెక్షన్ చేసిన సుకు పుర్వాజ్ తో రిలేషన్ ఉందని, అతడితో క్లోజ్‌గా ఉన్న పిక్స్ పోస్ట్ చేయడంతో విషయం అర్థమవుతుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సీరియల్ నటి సుజాత క్షయ పెట్టిన కామెంట్‌ని బట్టి వీళ్లు రిలేషన్‌లో ఉన్నారని ఫిక్స్ అయిపోవచ్చు అంటున్నారు. సుజాత, ‘లవ్ లవ్ అండ్ లవ్ యూ బోథ్.. కీప్ రాకింగ్ ఆల్వేస్’ అంటూ కామెంట్ పెట్టింది. దానికి ‘థాంక్యూ డియర్’ అంటూ జ్యోతి రిప్లై ఇచ్చింది.
మరి కొందరు.. ‘వాళ్లు మంచి స్నేహితులు.. వాళ్ల మధ్య అలాంటివి ఏమీ లేవు, అనవసరమైన కామెంట్లు పెట్టొద్దు’ అంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి రాయ్ ప్రస్తుతం తెలుగులో ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో బిజీగా గడుపుతోంది. తెలుగు, కన్నడ భాషల్లో దాదాపుగా 20 సీరియల్స్‌లో నటించింది. కొన్ని సినిమాలు అలాగే వెబ్ సిరీస్‌లు కూడా చేసింది. అసలు జ్యోతి పిక్స్ పోస్ట్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి?, వారి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది తెలియాలంటే జ్యోతి క్లారిటీ ఇస్తేనే కానీ అర్థం కాదు.