సమంతకు మయోటిస్ వ్యాధి లేదా అంతా నాటకమేనా ?

ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తుంటాయి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సమంత(Samantha) విషయంలో కూడా అలాగే అనిపిస్తుంది. ఒక హీరోయిన్ నోరు తెరిచి.. నేను పలానా వ్యాధితో బాధపడుతున్నా.. అందుకే సినిమా ప్రమోషన్స్‌కి రాలేకపోతున్నానని చెబితే.. అందులో కచ్చితంగా విషయం ఉంటుంది.. కాదని అనలేం. కానీ సమంత విషయంలో ఎందుకో అలా అనిపించడం లేదు. ఎందుకంటే.. తెలుగులో ఆమె నటించిన చివరి రెండు చిత్రాలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలే. ఒకటి ‘యశోద’ కాగా, రెండోది ‘శాకుంతలం’. అయితే ఆమె అనారోగ్యం ‘యశోద’ చిత్రానికి వర్కవుట్ అయినట్లుగా ‘శాకుంతలం’ చిత్రానికి మాత్రం కాలేదు. అందుకు కారణాలు ఏమిటనేది పక్కన పెడితే.. అసలు నిజంగా సమంత వ్యాధితో బాధ పడుతుందా? అనేలా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం.. బాలీవుడ్‌లో ఆమె చేస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీసే. సిటాడెల్ ఇంటర్నేషనల్ వెర్షన్‌లో రిచర్డ్‌ మాడెన్, ప్రియాంక చోప్రా కలిసి నటించారు. ఈ సిరీస్ బాలీవుడ్ రీమేక్‌లో ప్రియాంక చోప్రా పాత్రని సమంత చేస్తోంది. ఇప్పుడు ప్రియాంకా చోప్రా నటించిన ‘సిటాడెల్’ వరల్డ్ ప్రీమియర్‌‌కు బాలీవుడ్ రీమేక్ టీమ్ కూడా హాజరైంది. అందులో సమంత(Samantha) అచ్చం హాలీవుడ్ భామలానే మేకోవర్ అయింది. ఆమె మేకోవర్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాల ప్రమోషన్స్ టైమ్‌లో ఏడ్చి సింపతీ కొట్టేయాలని చూసినట్లుగా.. ఈ ప్రీమియర్స్‌లో ఆమె కనిపించడం లేదు. యమా జాలీగా.. టైట్, కురచ దుస్తుల్లో అందాలు ఆరబోస్తూ.. చలాకీగా కనిపిస్తుంది. అసలామెను చూసిన వారంతా.. నిజంగా ఆమెకు వ్యాధి ఉందా? కావాలనే అలా నాటకమాడిందా? అనేలా అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం.. తప్పంతా చైతూదే అన్నట్లుగా సీన్ క్రియేట్ చేయాలని చూసిన సమంత.. ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. అందుకు చైతూ మౌనం కూడా కారణమైంది. అయ్యో.. అని సమంతపై అంతా జాలి ప్రదర్శించారు. ఆ జాలికి తోడు మయోసైటీస్‌తో మరింత సానుభూతిని సమంత పొందింది. దీంతో ఆమె నటించిన ‘యశోద’ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ లాభాలను గడించి పెట్టింది. ఆఫ్‌కోర్స్ సినిమాలో కూడా విషయం ఉందనుకోండి. అయితే ‘శాకుంతలం’ విషయంలో మాత్రం సమంత (Samantha) ఎన్ని డ్రామాలు ప్లే చేయాలని చూసినా పప్పులు ఉడకలేదు.

 

 

ఇప్పుడు ‘ఖుషి’, ‘సిటాడెల్’ రీమేక్ కోసం సమంత సిద్ధమైంది. ఈలోపు ‘సిటాడెల్’ ఒరిజినల్ విడుదల అవుతున్న నేపథ్యంలో సమంత యాక్టివ్‌నెస్ చూసి.. అంతా ఆమె తీరును తప్పు బడుతున్నారు. లండన్‌లో సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్‌‌ను ప్లాన్ చేశారు ఈ ప్రీమియర్‌కు హాజరైన సమంత(Samantha) ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మరి హాలీవుడ్‌లో మెరవాలని అలా చేస్తుందో.. లేదంటే టాలీవుడ్‌లో సింపతీని కొట్టేస్తే చాలనుకుంటుందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఆమె మేకోవర్ మాత్రం చాలా వరకు డ్యామేజ్‌కు కారణమవుతుందన్నది మాత్రం కాదనలేని నిజం.

 

Leave a Reply

%d