సంక్రాంతికి రథం ముగ్గుల విశిష్టత

సంక్రమణం రోజు రథం ఇంట్లోకి వస్తున్నట్లుగా కనుమ నాడు బయటకు వెళ్తున్నట్లుగా ముగ్గు వేస్తారు. ఈ రథం ముగ్గును సూర్య భగవానుడి రథంగా భావిస్తారు.

అంతే కాదండోయ్ మన ఇంటి ముందు వేసే రథం ముగ్గుకు ఒక గీతను గీసి పక్కింటి ముగ్గుతో కలుపుతాం.వారు ఆ పక్కింటి వారి రథం ముగ్గుకు కలుపుతారు.

ఇలా అందరూ తమ ముగ్గులను వేరే వారి ముగ్గులతో కలుపుకుంటూ వెళ్తారు. ఇలా చేయడం వల్ల ఆ సూర్య భగవానుడి గ్రామంలోని వాడ వాడ తిరిగుతాడని ప్రజల నమ్మకం.

సూర్యుడు అలా తిరగడం వల్ల ఆ సూర్య కిరణాలు తమ ఇంటిపై పడి తమకు అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. అందుకే ఈ రోజు సూర్య దేవుడిని ప్రార్థిస్తే.. ఆరోగ్యంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం.

ముగ్గు అనేది చుక్కలు పెట్టి గీతలు గీయడం కాదు. అది ఒక కళ, ఒక శాస్త్రం, భారతీయులకే సొంతమైన అందమైన చిత్రకళ. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో హిందువుల ఇళ్లలో, దేవాలయాలలో, నాట్య ప్రదర్శనలు, పండగ రోజులలో ఈ ముగ్గుల అలంకరణ తప్పనిసరిగా చూడవచ్చు. తెలుగువాళ్లు ముగ్గు అని, తమిళులు కోళం అని, కన్నడిగులు రంగవల్లి అని, కేరళలో పూక్కళం లేదా పూవిడల్ అని, మధ్యప్రదేశ్లో చౌక్ ప్పూర్ణ, ఉత్తరప్రదేశ్లో లిఖ్నూ సోనా అని, గుజరాత్లో సథియా అని పిలవబడుతుంది. ఈ ముగ్గుల పూర్వచరిత్ర గురించి తెలుసుకుంటే ఇది చాలా పురాతనమైనది. సింధు లోయలోని శిథిలాలలో హరప్పాలో ఇప్పటి మెలిక ముగ్గుల వంటి చిత్రాలను కనుగొన్నారు. ఎన్నో పురాతన ఆలయాల చూడవచ్చు. లోని స్తంభాలపై కూడా ముగ్గులను దానికి తమిళనాడులోని ఇప్పటి కరూర్ తంలో పదవ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన పశుపతీశ్వర ఆలయపుశిల్పాలే నిదర్శనం. దక్షిణ చెన్నైలోని తిరువాణ్మె అనే ఊరిలో ఉన్న మరుందీశ్వరర్ (ఓషధీశ్వరుడు) గుడిలో కూడ మూడు త్రిభుజాలతో మెలిక ముగ్గులాటి శిల్పం ఒకటుంది.

ప్రతీ మనిషి ఒక రథం వంటివాడు. అది ఎంత అందంగా, ఆడంబరంగా, గొప్పగా వెళ్ళినా చివరికి చేరేది మరు భూమియే కాబట్టి అందరూ తెలియచేస్తుంది ఈ మంచిగా ముగ్గు. సంక్రాంతినాడు ఇంటిముందు రంగులతో అలంకరించిన ముగ్గు మధ్యలో ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను కూడా పెడతారు. దానికి పసుపు, కుంకుమతో బొట్లుపెట్టి, బంతిపూలతో అలంకరిస్తాను. నాలుగు ఒకే సైజులో ఉన్న గొబ్బెమ్మలు, మధ్యలో మాత్రం కాస్త పెద్ద గొబ్బెమ్మను పెడతారు. అసలు ఈగొబ్బెమ్మలు పెట్టడం వెనుక ఉన్న తెలుసుకుంటే కలుగుతుంది. గోపి+బొమ్మ = గొబ్బెమ్మ… గోపి లేదా గోపికలు శ్రీకృష్ణుని మనస్ఫూర్తిగా ప్రేమించి అతనే సర్వాంతర్యామి అని భావించి అతనిలోనే ఐక్యం అవ్వాలి, మోక్షం పొందాలి అనే ధృడాభిప్రాయం ఉన్న కాంతలు. శ్రీకృష్ణుడు తన భర్తయని నమ్మి, అతను తప్ప వేరే ధ్యాస లేని మహాభక్తురాలు గోదాదేవి. శ్రీరంగనాధుని వలచి అతనిని పెళ్లి చేసుకున్న భక్తురాలు. ఈ గొబ్బెమ్మలలో నాలుగువైపులా ఉన్నవి ఆ గోపకాంతలు, మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మ ఆండాల్ లేదా గోదాదేవి అని పెద్దలు చెబుతారు.

మీ 

మీనాక్షి మధురవాణి

Leave a Reply

%d