శరత్ బాబు చనిపోలేదు కోలుకుంటున్నారు

అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు హెల్త్ కండిషన్ పైన ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ఆయన మృతి చెందారంటూ బుధవారం కొన్ని వెబ్ సైట్లు వార్తలు రాయడం, సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు సంతాపం తెలపడంపై షాక్ కు గురి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శరత్ బాబు సోదరి మాట్లాడుతూ… శరత్ బాబు ఇటీవలి కంటే కోలుకున్నారని, త్వరలో మరో గదికి షిఫ్ట్ చేస్తారని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని కోరారు. త్వరలో శరత్ బాబు పూర్తిగా కోలుకొని మీడియా ముందుకు వస్తారని చెప్పారు. స్వగ్రామంలో ఉంటున్న ఓ సోదరుడు కూడా శరత్ బాబు కోలుకుంటున్నట్లు చెప్పారు.

For More News Click: https://eenadunews.co.in/

శరత్ బాబు పీఆర్ కూడా హెల్త్ కండిషన్ పై స్పందించారు. శరత్ బాబుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, ఆయన క్రమంగా కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయన పూర్తిగా కోలుకొని అందరి ముందుకు వస్తారని చెప్పారు. గతవారం శరత్ బాబు అనారోగ్యం కారణంగా హైదరాబాదులో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. గత మార్చిలోను అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు చెన్నైలో చికిత్స చేయించారు.

Leave a Reply

%d