సర్పంచుల బాధలతో సినిమా

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సర్పంచుల సాధక బాధకాలను వివరిస్తూ నిర్మిస్తున్న ‘అయ్యో పాపం’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌, నిర్మాత సాయివెంకట్‌ విడుదల చేశారు. అలాగే ‘మా మంచి సర్పంచి మా శంకరన్న.. మాట తప్పనివాడు మా శంకరన్న’ పాటను కూడా రిలీజ్‌ చేశారు. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలను వివరిస్తూ రూపొందుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని కోరారు. చిత్ర దర్శకుడు కొర్ర శంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ ‘తెలంగాణ విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో నేను రాసుకున్న ఫ్యామిలీ సెంటిమెంట్‌, క్రైమ్‌ అంశాలు కలిగిన కథ విని ముప్పాల ప్రసాదరాజు ఈ చిత్రం తీయడానికి ముందుకు వచ్చారు. ఇప్పటివరకూ 30 శాతం షూటింగ్‌ అయింది. తెలుగు రాష్ట్రాలలోని సర్పంచులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నాం’ అన్నారు. రజనీకుమార్‌, జీవన్‌కుమార్‌, సపాన్స్‌, షేకింగ్‌ శేషు, శ్యామల, శంకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానిక ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: వి.రజనీకుమార్‌, మొగిలే విజయ్‌కుమార్‌ చిన్నా. ఛాయాగ్రహణం: ఎ.వెకంట్‌, సంగీతం: భాను.

Leave a Reply

%d