భారస ఎమ్మెల్యే అమ్మాయిలను పంపమని టార్చర్

స్టేషన్‍ఘన్‍పూర్ ఎమ్మెల్యే రాజయ్య పై ఓ సర్పంచ్ లైంగిక ఆరోపణలు చేసిన విషయం మరవకముందే తాజాగా మరో ఎమ్మెల్యే పై లైంగిక ఆరోపణలు వచ్చాయి.  బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ మహిళా తీవ్ర ఆరోపణలు చేశారు. తమను ఎమ్మెల్యే నమ్మించి మోసం చేశాడని.., అమ్మాయిల్ని పంపిచమని టార్చర్ చేశారని ఆరిజన్ పాల సంస్థలో పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్న శైలజ అనే మహిళ ఆరోపించారు. ఆయన చెప్పిన పని చేయలేదని కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టించి తమను అరెస్టు చేయించాడన్నారు. ఆ మేరకు ఆమె ఓ ఆడియో, వీడియోతో పాటు కొన్ని వాట్సప్ చాటింగ్‌లను ఆమె మీడియాకు విడుదల చేశారు.

“నేను ఆరిజన్ డైరీలో పార్ట్‌నర్‌గా ఉంటున్నాను. బెల్లంపల్లి ఎమ్మెల్యే మమ్మల్ని నమ్మించి మా మనీ తీసుకొని తిరిగి మాపైనే తప్పుడు కేసులు పెట్టి రిమాండ్‌కు పంపించాడు. బెల్లంపల్లిలో మా బ్రాంచ్ ఓపెనింగ్‌ సందర్భంగా దుర్గం చిన్నయ్యను ఫస్ట్ టైం కలిశాము. కావాల్సిన సాయం చేస్తామమంటే తాను చెప్పిన పర్సన్‌కు మా కంపెనీలో షేర్ ఇచ్చాం. బిజినెస్ మీటింగ్‌కోసం ఈయన్ను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రెగ్యూలర్‌గా కలిసేవాళ్లం. ఓ రోజు మా కంపెనీలో పనిచేసే అమ్మాయి కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వచ్చింది. ఆమెను చూసిన ఎమ్మెల్యే ఆ తర్వాత కాల్ చేసి ఆ అమ్మాయిని పంపిస్తారా అని అడిగారు. ఆ అమ్మాయి అలాంటిది కాదు. మేము ఇలాంటివి చేయలేమని చెప్పాం. ఎవరో ఒక అమ్మాయిని పంపించాల్సిందేనని లేకపోతే తరువాత మీ ఇష్టం అంటూ ఎమ్మెల్యే బెదిరించాడు. దీంతో చేసేదేం లేక తెలిసిన వాళ్ల ద్వారా బ్రోకర్ల నెంబర్లు ఆయనకు ఇచ్చాం. వాళ్లతో ఆయన టచ్‌లో ఉన్నారు. తరువాత మీటింగ్ ఉందని దళితబంధు సమావేశమని మళ్లీ ఒకసారి మమ్మల్ని పిలిపించి ఆల్కహాల్ ఏర్పాటు చేశారు. నాతో బలవంతంగా తాగించేందుకు బలవంతం చేశాడు. దీంతో నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను.

Leave a Reply

%d bloggers like this: