తిరుమల వెంకన్నను దర్శించుకున్న షారుఖాన్

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ తిరుమల శ్రీవారిని  దర్శించుకున్నారు. కుమార్తె సుహానాఖాన్‌, భార్య గౌరీ ఖాన్‌, నయనతారతో  కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షారుక్‌కు స్వాగతం పలికి స్వామి సేవ, దర్శనం ఏర్పాటు చేశారు. అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘ జవాన్‌’ చిత్రం ఈ నోల 7వ తేదిన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్‌ శ్రీవారిని దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. జనవరిలో ‘పఠాన్‌’ చిత్రంతో రికార్డులు సృష్టించిన షారుఖ్‌ ‘జవాన్‌తోనూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సినిమాకుపై అంచనాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే!

Leave a Reply

%d bloggers like this: