ముసుగులో అమ్మాయి… ముసుగు తీస్తే అబ్బాయి

కొంతకాలం కింద ఓ వ్యక్తికి సోషల్ మీడియాలో అమ్మాయి పేరుతో ఉన్న ఓ ఖాతాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. అవతలి వారు అతడి రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశారు. దాంతో మనోడు చాటింగ్ మొదలెట్టాడు. అలా కొంతకాలం చాటింగ్ చేసిన తర్వాత ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. అతడి ప్రపొజల్ ఆమె కూడా ఓకే అని చెప్పింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత అసలు కథ మొదలైంది. మనోడు ఒకసారి నిన్ను చూడాలి ఏవైనా ఫొటోలు ఉంటే పంపించు అన్నాడు. దానికి ఆమె ముఖంపై స్కార్ప్‌ ఉన్న ఫొటో పంపించింది. ఎన్నిసార్లు అడిగిన అలాంటి ఫొటోలే పంపించడం చేసింది. దాంతో మనోడు ఇలాగైతే కాదు. ఒకసారి నిన్ను కలవాలి అని అన్నాడు. దానికి ఆమె సరే అంది. ఇద్దరు మాట్లాడుకుని ఓ ప్లేస్ అనుకున్నారు.

అంతే.. మనోడు లవర్‌ను కలవబోతున్నాననే ఉత్సాహంతో అనుకున్న చోటుకి ముందే చేరుకున్నాడు. ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఆమె రానే వచ్చింది. అక్కడ కూడా ముఖానికి స్కార్ఫ్‌తోనే వచ్చింది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడైనా ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీయొచ్చు కదా అని అడిగాడు. దానికి ఆమె నిరాకరించింది. ఎన్ని సార్లు అడిగినా ముఖానికి చుట్టుకున్న స్కార్ఫ్‌ను తీయని ప్రేయసిపై అతడికి అనుమానం వచ్చింది. దాంతో బలవంతంగా ఆమె స్కార్ఫ్‌ను తొలగించాడు. అంతే.. మనోడి ఫీజులు ఔట్. అక్కడి కనిపించిన దృశ్యం చూసి నోటమాట రాలేదు. ఎందుకంటే అతను ప్రేమించింది ఆమె కాదు.. అతడు. ఇన్నాళ్లు మనోడితో అమ్మాయిలా చాటింగ్ చేసింది.. కలవాలంటే అక్కడికి వచ్చింది ఓ అబ్బాయి. ఈ ఘటన తాలూకు వీడియో ‘ఘర్‌కే కలేష్’ అనే ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా పోస్ట్ అయింది. అంతే.. క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: