బాబా అవతారమెత్తిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్… పీఏ పల్లి (మం)అజమాపురంలో పది ఎకరాల స్థలంలో ఆశ్రమం నెలకొల్పాడు. కొంతకాలంగా ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపణలు తాజాగా వెలుగు చూశాయి. హోమాల పేరుతో మోసాలు…దేవుడి ముసుగులో దోపిడీ చేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. ఇదిలా ఉండగా రోగం నయం చేస్తానని భక్తుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు ఈ సాఫ్ట్ వారే బురిడీ బాబా. ప్రవచనాలు,హోమాలు, తాయిత్తులే పెట్టుబడిగా దందా నిర్వహించటం, విశ్వ చైతన్య పేరుతో యూ ట్యూబ్ ఛానెల్ వేదికగా భక్తులను ఆకట్టుకుంటూ వచ్చాడు. తాజాగా ఒక బాధిత మహిళ ఫిర్యాదుతో బురిడీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన .. టాస్క్ ఫోర్స్ పోలీసులు బాబా విశ్వ చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ బాబా నుంచి లక్షల్లో నగదు,నగలు, కోట్ల విలువ గల ల్యాండ్ డ్యాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇతని మోసాలపై విచారణ జరుపుతున్నారు.
నల్గొండ జిల్లాలో సాఫ్ట్ వేర్ బాబా మోసాలు
