భార్యతో సుఖం కోసం కొడుకును హత్య చేసిన తండ్రి

మీరు చదివిన శీర్షిక కరెక్టే… సొంత భార్య సంసారానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకును దారుణంగా హత్య చేశాడు ఓ కసాయి తండ్రి.  ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.

For More News Click: https://eenadunews.co.in/

 

పోలీసుల కథనం ప్రకారం.. మధ్య ప్రదేశ్ ఇండోర్ నగరంలో శిశుపాల్ ముండే అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలనికి ఈ దంపతులకు ప్రతీక్ (7) అనే కుమారుడు జన్మించాడు. అయితే పరిస్థితుల దృష్ట్యా శిశుపాల్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇదిలా ఉండగానే.. ఇతగాడు గతేడాది పాయల్ అనే యువతిని మూడో వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే ఉంది. అయితే శిశుపాల్ మొదటి భార్య కుమారుడు ఈ దంపతుల వద్దే ఉండేవాడు. ప్రతీక్ ను పాయల్ ఇష్టంగా చూసుకునేది కాదు. మొదటి భార్య కొడుకుని నేనెందుకు చూడలనే కోపంతో ఆ బాలుడిని హీనంగా చూసేది. ఇక ఇదే అంశంపై పాయల్ భర్తతో గొడవ కూడా పడేది. ఇదిలా ఉంటే పాయల్ గర్భవతి కావడంతో ఇటీవలే పుట్టింటికి వెళ్లి ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇక భార్యాభర్తలు ఇద్దరు తరుచు ఫోన్ లో మాట్లాడుకునేవారు. అయితే ప్రతీక్ ఉండగా నేను ఇంటికి రానని పాయల్ భర్త శశిపాల్ కు తెగేసి చెప్పింది. అతడు భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. పాయల్ మాత్రం అస్సలు వెనకడుగు వేయకుండా.. నీ కొడుకు ఉంటే అసలు నీతో సంసారం చేయనంటూ గట్టిగా చెప్పింది. దీంతో శశిపాల్ అయోమయంలో పడ్డాడు. ఇక అతడికి కొడుకు ప్రతీక్ కన్న మూడో భార్య పాయల్ ఎక్కువే అనుకున్నాడు. భార్య చెప్పిందని శశిపాల్ సోమవారం తన కుమారుడు ప్రతీక్ ను గొంతు పిసికి హత్య చేశాడు. కొడుకుని చంపే క్రమంలో అదంతా వీడియో తీసుకున్నాడు. అదే వీడియో మూడో భార్య పాయల్ కు వాట్సాప్ లో పంపాడు. అసలు విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని శశిపాల్ ముండో అతని మూడో భార్య పాయల్ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా వీళ్లు నేరాన్ని అంగీకరించారు. దీంతో భార్యాభర్తలను ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

 

Leave a Reply

%d bloggers like this: