ప్రత్యేక ఆఫర్ ప్రారంభించిన ఎస్ఎల్‌జీ ఆస్పత్రి

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బీఎండీ (బోన్ మినరల్ డెన్సిటీ) స్కాన్ సదుపాయాన్ని ప్రారంభించింది. సాధార‌ణంగా అయితే రూ.5వేల విలువ చేసే ఈ ప‌రీక్ష‌ను ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు ఎటువంటి ఖర్చు లేకుండా చేస్తున్నారు. నిజాంపేట ప‌రిస‌ర ప్రాంతాల్లో ఈ త‌ర‌హా స్కానింగ్ స‌దుపాయం ఒక్క ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో త‌ప్ప మ‌రెక్క‌డా లేదు.

ఆస్పత్రి ప్రాంగణంలో బుధవారం ఉదయం 11 గంటలకు జరిగిన ఈ కార్యక్రమానికి నిజాంపేట మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి కొలన్ నీలా గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 40 ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో ఎముకల సాంద్రత కొంత తగ్గే ప్రమాదం ఉంటుందని, దాన్ని అలాగే వదిలేస్తే బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపోరోసిస్)కు దారితీసి సమస్య తీవ్రతరం అవుతుందని చెప్పారు. అందువల్ల 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళ కనీసం ఏడాదికోసారి తప్పనిసరిగా బీఎండీ స్కాన్ చేయించుకుని, తమ ఎముకల పరిస్థితి ఏంటో తెలుసుకోవాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా ఎస్ఎల్‌జీ ఆస్పత్రి యాజమాన్యం ఈ స్కానింగును ఉచితంగా అందించడం ఈ ప్రాంతంలోని మహిళలకు పెద్ద వరమని ఆమె ప్రస్తుతించారు.

ఆస్పత్రి ఛైర్మన్ దండు శివరామరాజు మాట్లాడుతూ, అన్నిరంగాల్లో ముందంజలో ఉంటున్న మహిళలు ఒకవైపు ఇంటి బాధ్యతలు, మరోవైపు వృత్తిజీవితంతో సతమతం అవుతూ, తమ సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వారి సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం, వారు తమ ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్త వహించేల ప్రోత్సహించడానికి తమ ఆస్పత్రి ఆధ్వర్యంలో మహిళలందరికీ ఉచితంగా బీఎండీ స్కాన్‌ చేస్తున్నామని చెప్పారు. మహిళలందరూ ఈ సదవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో సీఓఓ నాగకుమార్, ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ గైన‌కాల‌జిస్టు డాక్టర్ శిరీష, క‌న్స‌ల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ డి.వి. సంధ్య, క‌న్స‌ల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ స్రవంతి, బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టరర్ డి.వి. దీప్తి, న‌ర్సింగ్ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

%d