ఫిట్స్ ఈ పదం వింటనే చాలా మందిలో ఆందోళనకు గురవుతారు. ఫిట్స్ వచ్చిన వారి కంటే ఎక్కువగా పక్కన ఉన్నవారు చాలా ఇబ్బంది పడుతారు. అంతేకాకుండా వారితో కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. అయితే ఇప్పుడు మనం చదివే వార్త ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన హంపికకు మూడేళ్ళప్పుడే ఫిట్స్ రావడం మొదలైంది. కానీ నాటి నుంచే వాటిని ధైర్యంగా ఎదురుకోవడం మొదలుపెట్టింది. ఫిట్స్ రావడం అనేది నాకు ముందు నుండే తెలిసేది. ఆ లక్షణాలను నేను గుర్తుపట్టగలను. కిమ్స్ హాస్పిటల్ లోని న్యూరాలజిస్ట్ సీతా జయలక్ష్మి దగ్గర వైద్యం చేయించుకున్న తరువాత పూర్తిగా నయం అయింది. బిటెక్ పూర్తి చేసి, ఐటీ జాబ్ చేసింది. ప్రస్తుతం ఎరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రోపెసర్ గా పని చేస్తుంది. అయితే ఫిట్స్ ఉన్నాయని ఏనాడు కూడా ఆధైర్య పడవద్దని ఏదీ రాదని అలాగే కూర్చోవద్దని కిమ్స్ హాస్పిటల్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. వ్యాధులు అనేకం ఉన్నాయని వాటిలో ఒకటి ఈ వ్యాధని పేర్కొన్నారు. ఇప్పుడు నేను పిహెచ్ డి కూడా చదువుతున్నాని తెలిపారు.
ఫిట్స్ ని జయించిన – హంపిక
