ఉద్యమ నాయకుడిని కొల్పోయాం – ప్రియాంక

అమరావతి ఉద్యమంలో ఊపిరి పోసిన గొప్ప నాయకుడు నన్నపనేని కోటేశ్వరరావు అని అన్నారు గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా కార్యదర్శి ప్రియాంక. ఆయన మరణం పార్టీకి నష్టమని పేర్కొన్నారు. సోమవారం ఆయన నివాసంలో నివాళ్లు అర్పించారు. తెలుగుదేశం పార్టీ కోసం ఎనలేని సేవ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఆయన మరణించిన పార్టీ కార్యకర్తల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. అమరావతి ఉద్యమ నాయకుడు పువ్వాడ. సుధాకర్, మరియు రాజధాని గ్రామాల నుంచి అమరావతి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై ఘన నివాళులర్పించారు.

Leave a Reply

%d