హైటెక్స్ లో దీప్ మేళా సందండి మొదలైంది. ఈ మేళాను ఎంఇఐఎల్ డైరెక్టర్ సుధారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మేళాలోని ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి దేశ నలుమూలల నుండి వచ్చిన వస్తువులను ఆమె తిలకించారు. ఈ దీపిక్షా మహిళా క్లబ్ ఆధ్వర్యంలో ఈ మేళా కొనసాగుతోంది. ఈ మేళా ద్వారా వచ్చిన ఆదాయంతో అనాధాలకు అండగా నిలిస్తున్న దీపిక్షా మహిళా క్లబ్ గత కొన్ని సంవత్సరాలుగా కన్య గురుకల పాఠశాలను దత్తత తీసుకుంది. ఈ పాఠశాల నిర్వహణ మొత్తం ఈ క్లబ్ సభ్యులు నిర్వహిస్తున్నారు.ఇందు కోసం ప్రతి యేటా దీప్ మేళా ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ఈ మేళాలో వచ్చిన నిధులను దత్తత పాఠశాల కోసం ఖర్చు చేస్తారు. అలాగే ఈ సారి కూడా హైటెక్స్‌లో మూడు రోజుల పాటు అంటే ఈ నెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు దీప్ మేళా ఎగ్జిబిషన్ జరగనుంది.
ఈ మేళాలో గృహిణులను ప్రోత్సహించడానికి వారు ఉత్పత్తి చేసిన వాటిని వారు కళాత్మక వస్తువులు, అల్లిన దుస్తులు, కుట్టిన వస్తువులు, ఎంబ్రాయిడరీ వస్తువులు లేదా పాపడ్, ఊరగాయలు, వడలు వంటి ఇంట్లో తయారు చేసిన వస్తువులను విక్రయించేలా ప్రోత్సహిస్తారు. చురాన్, మొదలైనవి ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. అలాగే కన్స్యూమర్ & కార్నివాల్స్ పరిశ్రమలో దుస్తులు & దుస్తులు, అద్భుతమైన బహుమతి , ఆభరణాలు మరియు ఉపకరణాలు, గృహోపకరణాలు, డెకర్ ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు మరియు సౌందర్య ఉత్పత్తులు, ఆహారం & పానీయాలు, వస్త్రాలు, హ్యాండ్‌బ్యాగ్‌లు మొదలైన ఇతర ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి.
దీప్ మేళా వివరాలు మీకోసం
వేదిక: హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కొండాపూర్, హైదరాబాద్.
తేదీ: 11 ఆగస్టు (శుక్రవారం) 2023 నుండి 13 ఆగస్టు, (ఆదివారం), 2023 వరకు
సమయం: ఉదయం 10:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు