ఉప్పులింగాపూర్ లో యువకుడి ఆత్మహత్య

పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారని భయపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలవరపెడుతోంది. వివరాల్లోకి వెళ్తే… మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ చేపట్టారు. ఆ సమయంలో అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన చిన్న శంకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన సాయికుమార్ ద్విచక్ర వాహనంపై వచ్చాడు. వాహన తనిఖీ చేయడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు వారిస్తున్నప్పటికీ వెళ్లి ట్రాన్స్ ఫార్మర్ ను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Leave a Reply

%d