వైకాపా నేతలా ఐ డోంట్ కేర్ – రజనీకాంత్

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ పర్యటన రాజకీయంగా పెనుదుమారాన్నే రేపింది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన చేసిన కామెంట్స్‌పై అధికార వైసీపీ ఫైర్ అవుతోంది. కొందరు నేతలు పరుషపదజాలంతో దూషించారు. ఈ విమర్శళ టైంలో రజనీకాంత్‌కు టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు.

For More News Click: https://eenadunews.co.in/

నాలుగు మంచిమాటలు చెప్పినా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని రజనీతో చంద్రబాబు అన్నట్టు సమాచారం. ఇలా మాటలు దాడి చేయడం చాలా బాధాకరమని వారించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి చింతిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.

ఇలాంటివి తాను పట్టించుకోవడం లేదని చంద్రబాబుకు రాజనీకాంత్‌ బదులిచ్చారట. ఉన్న విషయాలే చెప్పానని… ఎవరు ఎలా మాట్లాడుకున్నా తాను పట్టించుకోబోనని చెప్పినట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నానని… మాట మారేది లేదన్నారని చెప్పుకుంటున్నారు.

Leave a Reply

%d bloggers like this: