బిఆర్​ఎస్ ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ

బిఆర్ఎస్ సీనియర్ నేత, పటాన్ చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2014లో పటాన్ చెరు సమీపంలోని ఓ పరిశ్రమపై దాడి చేసిన ఘటనలో మహీపాల్ రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ అప్పట్లో సంగారెడ్డి జిల్లా కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధించింది. దీన్ని ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. జిల్లా కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆయనకు ఊరట లభించింది. అప్పటి నుంచి ఈ కేసులో స్టే కొనసాగుతూనే ఉంది.

For More News Click: https://eenadunews.co.in/

కాగా, హైకోర్టు ఇచ్చిన స్టేపై ఎంఏ.ముఖిమ్ అనే న్యాయవాది ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డితోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Leave a Reply

%d