బండి సంజయే రాష్ట్ర అధ్యక్షుడు

తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవిలో మార్పులేదని తేల్చి చెప్పారు ఆ పార్టీ రాష్ట్ర సమన్వయ కర్త తరుణ్ చూగ్. తెలంగాణ చీఫ్ గా బండి సంజయ్ కొనసాగుతారని వెల్లడించారు. అధ్యక్షుడి మార్పు అంశంపై పదే పదే ప్రచారం చేయడం సరికాదని అన్నారు. దీనిపై ఇంతకుముందే స్పష్టత ఇచ్చామని, అయినా ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడంలేదని తెలిపారు. కాగా, ఇటీవల పరిణామాల నేపథ్యంలో తెలంగాణ బిజెపి నాయకత్వ మార్పు తథ్యమని కొన్ని కథనాలు, బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారంటూ మరికొన్ని కథనాలు రావడం తెలిసిందే.

Leave a Reply

%d