డిఎంహెచ్ఓ పై కిమ్స్ సవీర విజయం

టీసిఏ కార్పొరేట్ క్లబ్ టీ-20 టోర్నమెంట్ లో కిమ్స్ సవీర విజయం సాధించింది. గత రెండు నెలలుగా జిల్లాలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థల మధ్య టీసీఏ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతుంది. ఫైనల్ మ్యాచ్ లో కిమ్స్ సవీర, డిఎంహెచ్ఓ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డిఎంహెచ్ఓ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకు అలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కిమ్స్ సవీర జట్టు కేవలం 9.5 ఓవర్ల 2 వికెట్లు కొల్పోయి విజయడాంఖ మోగించింది.

కిమ్స్ సవీర జట్టు నుండి నరేంద్ర (54), కిషోర్ రెడ్డి, (42), ప్రదీప్ (26) పరుగులు చేసి మ్యాచ్ లో కీలక పాత్ర పోషించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నరేంద్ర బహుమతి అందుకున్నారు. కెఎస్. ముస్సు 4 ఓవర్లుకు 11 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే నరేంద్ర 4 ఓవర్లకు 13 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడకొట్టారు. కిమ్స్ సవీర జట్టులో ఎస్.వి. కిషోర్ రెడ్డి (కెప్టెన్), శ్రీకాంత్ రెడ్డి, దినేష్, బిస్మిల్లా, ప్రదీప్, నరేంద్ర, మహేష్, ముసాధిక్, సాయికుమార్, పవన్ కుమార్, మధు కిరణ్, కిరణ్, సాగర్, గిరి, శ్యాముల్, లీనేష్ జట్లులో ఉన్నారు. అనంతరం టీసీఏ క్రికెట్ క్లబ్ ఛైర్మన్ శివారెడ్డి చేతుల మీదుగా కిమ్స్ సవీర జట్టు బహుతులను అందుకుంది.

Leave a Reply

%d