నిజామాబాద్ లో తెలుగుదేశం సభ

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేేశం పార్టీ పావులు కదపడానికి సిద్దమైంది. ఇప్పటికే ఖమ్మంలో సభ ఏర్పాటు చేసి తాము ఇంకా ఇక్కడ ఉన్నాం అనే సంకేతాలను జారీ చేసింది. ఈ సభతో మంచి జోష్ మీద ఉన్న తెలుగు తమ్ముళ్లు అదే ఉత్సాహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని అనుకున్నట్లు తెలుస్తోంది. తదుపరి సభలో నిజామాబాద్ జిల్లా ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస, భారాస మారి… దేశ వ్యాప్తంగా తిరిగితే… గతంలో మంచి పట్టు ఉన్న తమ పార్టీ ఏమాత్రం తగ్గేదేలేది అన్నట్టు వెళ్తోంది. పార్టీకి పునర్ వైభం తీసుకరావడమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని అధినేత చంద్రబాబు సూచించినట్లు సమాచారం. ఇందుకోసం నిజామాబాద్ సభ తరువాత అన్ని జిల్లాలో సభలు పెట్టి ఎన్నికల నాటికి కార్యకర్తలని మళ్లీ ఏకతాటి మీదకి తీసుకరావాలని పార్టీ చూస్తోంది. నిజామాబాద్ సభ తర్వాత ఎలాంటి ఉత్సహం వస్తుందో వేచా చూడాలి మరి.

Leave a Reply

%d