అమెరికాలో తెదేపా కార్యక్రమాలు అందుకేనా ?

అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు టీడీ జనార్ధన్‌, గాలి భాను ప్రకాశ్‌, పులివర్తి నాని, ముళ్ళపూడి బాపిరాజు, డా. రవి వేమూరులతో ఛార్లెట్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నారైలు కూడా కృషి చేయాలని కోరారు. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పులివర్తి నాని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలవడం ఖాయమని ఈ మేరకు తాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మాట కూడా ఇచ్చానని చెప్పారు. టీ.డీ. జనార్ధన్‌ మాట్లాడుతూ.. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికా, ఇతర దేశాల్లో కూడా ఘనంగా జరుపుతున్నట్లు చెప్పారు.

Leave a Reply

%d