రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలతో కార్యకర్తలలో జోష్ పెరుగుతుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. రాష్ట్ర ప్రజలంతా జగన్ సర్కార్ పై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. జగన్ తలకిందులైయ్యే ఫలితాలు వస్తాయన్నారు. ఇటీవల జిల్లాల పర్యటనలతో మంచి స్పందన వచ్చిందని మరిన్ని పర్యటనలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా వైకాపా నుండి అనేక మంది ప్రజా ప్రతినిధులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్దమయ్యారని అన్నారు. ఏపీలో తిరిగి ఎగరబోయేది తెలుగుదేశం జెండానేనన్నారు.
చంద్రబాబు పర్యటనలతో జోష్ పెరుగుతోంది – అనిత
