ఏపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా సంచలన విజయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్ష తెలుగుదేశం పార్టీ సంచలన విజయం సాధించింది. వైకాపా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్ప టికీ ఆ పార్టీ నుండి క్రాస్ ఓటింగ్ జరిగి టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధకు 23 ఓట్లు లభించడంతో ఆమె విజయం సాధించింది. వైకాపా నుంచి 6గురు విజయం సాధించారు. వాస్తవానికి ఎన్నికల్లో టీడీపీ కి 21 ఓట్లు ఉండగా గెలుపు కోసం ఆమెకు ఒక ఓటు అవసరం ఉంది. అనూహ్యంగా వైసీపీ నుంచి రెండు ఓట్లు క్రాస్ ఓటింగ్ ద్వారా అనురాధకు పోలవ్వడంతో ఆమె సంచలన విజయం సాధించింది. కోలా గురువులు ఓడిపోయారు. రెండో ప్రాధాన్యతా ఓట్లతో జయ మంగళ వెంకటరమణ విజయం సాధించారు. దీంతో మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు 8 మంది అభ్యర్థులు బరిలో దిగిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో ఊహించని రీతిలో ఏడింటిలో ఒక స్థానంలో వైసీపీకి ఓటమి పాలవ్వనుండటం ఆసక్తికరంగా మారింది. వైకాపాకు చెందిన ఏడుగురు అభ్యర్థులు ఏ అభ్యర్థికి ఓట్లు తగ్గి ఓడిపోతారన్నది ఉత్కంఠత రేగుతుంది. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమితో ఇబ్బంది పడుతున్న వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ ఉండి కూడా ఒక సీటు కోల్పోవడం రాజకీయంగా ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయనుంది.

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీలు

యేసు రత్నం 22 ఓట్లు
మర్రి రాజశేఖర్ 22 ఓట్లు
కోలా గురువులు 21 ఓట్లు
పోతుల సునీత 22 ఓట్లు
బొమ్మి ఇజ్రాయిల్ 22 ఓట్లు
సూర్యనారాయణ రాజు 22 ఓట్లు
జయమంగళ వెంకట రమణ 21 ఓట్లు

పంచుమర్తి అనురాధా 23 ఓట్లు టీడీపీ ఎమ్మెల్సీ

Leave a Reply

%d bloggers like this: