ఉమ్మడి మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఏ. వి. ఎన్ రెడ్డి గెలుపొందారు. సుమారు 1, 150 ఓట్ల తేడాతో సమీప పి.ఆర్.టి.యు టిఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు ఓట్ల లెక్కింపు జరిగింది. మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఏ అభ్యర్థికీ సరైన మెజార్టీ దక్కలేదు. అనంతరం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు.