పోరాడి ఓడిన టీమిండియా

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం ముగిసింది. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ లో భారత అమ్మాయిలు 5 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు.  173 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్ 43 పరుగులు చేసింది. వీరిద్దరూ అవుటైన తర్వాత దీప్తి శర్మ (20 నాటౌట్) పోరాడినా చివర్లో రన్ రేట్ పెరిగిపోయింది.  ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో భారత్ గెలవాలంటే 16 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్ 10 పరుగులు మాత్రమే చేసింది.  ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డనర్ 2, డార్సీ బ్రౌన్ 2, మేగాన్ షట్ 1, జెస్ జొనాస్సెన్ 1 వికెట్ తీశారు. కాగా, ఈ విజయంతో ఆసీస్ మహిళల టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరింది.

Leave a Reply

%d