ఆంద్రోళ్ళ ముందు కేసీఆర్ ఇజ్జత్ తీసుకున్నాడు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఈవోఐ బిడ్జింగ్‌ గడువు ముగిసింది. గత నెల 27న విడుదలైన ఈవోఐ ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఆసక్తిగల కంపెనీలు బిడ్లు దాఖలు చేయవచ్చని ఆహ్వానించారు. 22 కంపెనీలు బిడ్‌లు దాఖలు చేసినట్టు సమాచారం. కాగా బిడ్‌ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్లలో పాల్గొంటామ ని ఇన్నాళ్లు చెప్తూ వచ్చిన తెలంగాణ సర్కారు చివరి నిమిషం ఉసూరుమనిపించింది.

7 విదేశీ సంస్థలు ఈవోఐ దాఖలు చేశాయని కార్మిక నేత అయోధ్య రామ్ వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆసక్తి చూపినట్టు సమాచారం లేదని తెలిపారు. ఎన్ఎండీసీ వంటి కేంద్ర సంస్థలు కూడా ఈవోఐ దాఖలు చేయలేదని అయోధ్యరామ్ పేర్కొన్నారు. కాగా, విశాఖ ఉక్కు పరిశ్రమ ఈవోఐ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా బిడ్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్లాంట్ మళ్లీ గాడిన పడేందుకు నాలుగు నెలల పాటు నెలకు రూ.850 కోట్లు ఖర్చు చేస్తే చాలని, ఆ మొత్తాన్ని తాము క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరిస్తామని లక్ష్మీనారాయణ వెల్లడించడం చర్చనీయాంశం అయింది.

కాగా ఇటీవల తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ విశాఖ స్టీల్స్ కాపాడుకేనేది… ఆంధ్రులకు న్యాయం చేసేది భారస పార్టీ ఒక్కటేనని అన్నారు. ఇందుకు సింగరేణి సంస్థ నుండి కొంత మంది అధికారులు అక్కడి వెళ్లి పరీశీలించారు. భారస పార్టీ విస్తరణలో ఏపీలో పట్టుసాధించాడానికి కేసీఆర్ కి అస్త్రంగా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకు వెళ్దాం అనుకున్నాడు కానీ ఆదిలో కేసీఆర్ ఆంద్రోళ్ల ముందు ఇజ్జత్ తీసుకున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: