మాజీ సీఎల్పీ నాయకుడు కుందూరు జానారెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం ఖునీ చేస్తున్న అంశం, రాహుల్ గాంధీ పై ఎంపీగా అనర్హత వేటు వేయడం, ఆదాని లాంటి వాళ్ళు ప్రజాధనాన్ని లక్షల కోట్లు దోచుకొని పోవడం లాంటి అంశాలపై మాట్లాడడం ధజ్వమెత్తారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు పొత్తులపై ప్రస్తావించినపుడు నేను క్లుప్తంగా మాట్లాడాను. ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీకి వ్యతిరేకంగా 17 రాజకీయ పార్టీలు కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేస్తున్నాయని ఆ అంశాన్ని స్వాగతిస్తున్నానని మాత్రమే చెప్పాను. నేను బీఆర్ ఎస్ తో పొత్తు ఉంటుందని చెప్పలేదు. పొత్తుల విషయం అధిష్టానం నిర్ణయం మేరకు ఉంటుంది. అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యం.
తెలంగాణలో పొత్తుల లొల్లి
