సిద్దిపేటలో మంచానికి పరిమితమైన భర్త! భార్య చేసే పని ఇలా

సమాజం తలదించుకునే  పని చేసింది ఓ భార్య. కట్టుకున్న భర్త మంచానికే పరితమైతే… అన్ని పనులు చేయాల్సిన భార్య. తనకు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిచింది. అంతేకాకుండా ఆమె చేసిన పనితో ఇప్పుడు కుటుంబ సభ్యులు నివ్వేర పోతున్నారు.  24 ఏళ్లు. గత కొన్నేళ్ల కింద ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా గడిపారు. అలా ఆనందంగా సాగుతున్న తరుణంలోనే ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యాడు. ఈ దెబ్బతో వారి సంసారం ఒక్కసారిగా తలకిందులైంది. అయితే భర్త ఎటూ కదలకుండా మంచానికి పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే భార్య మమత భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. భార్య ఇలా చేయడంతో భర్త నమ్మలేకపోయాడు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని చౌదరిపల్లి గ్రామం. ఇక్కడే బీద రాజు- మమత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అలా కొంత కాలానికి వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. ఇక పుట్టిన కూతురుని చూసుకుంటూ భార్యాభర్తలు ఆనందంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎనిమిది నెలల కిందట భర్త రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కొన్నాళ్లు ఆస్పత్రికి చికిత్స పొంది తిరిగి ఇంటికొచ్చాడు. దీంతో అప్పటి నుంచి రాజు మంచానికి పరిమితమై ఇంట్లోనే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి భర్త, అత్త ఇద్దరూ మమమతో గొడవ పడ్డారు.

గురువారం కూడా మరోసారి తల్లీ కొడుకు మమతతో గొడవపడ్డారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. అదే రోజు మమత, తన కూతురుని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం అయినా తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న మమత తల్లి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఉన్నట్టుండి భార్య ఇలా చేస్తుందని మాత్రం భర్త ఊహించలేకపోయాడు. మమత కనిపించకపోవడంతో ఆమె తల్లితో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Leave a Reply

%d