తాను తీసుకున్న గోతిలో పడ్డ కేసీఆర్

దేశ వ్యాప్తంగా సంచలనం మారిన ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. సిట్ను రద్దు చేసిన న్యాయస్థానం తక్షణమే దాన్ని సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తునకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సీబీఐకు ఇవ్వాలని చెప్పింది.

ఫాంహౌస్ కేసులో సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ లేదా ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థ ద్వారా ఎంక్వైరీ చేయాలని అభ్యర్థించింది. దర్యాప్తు వివరాల లీకులపై పిటిషనర్లు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ సైతం ఆధారాలను లీక్ చేసిన విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల తరఫున మహేశ్ జఠ్మలానీ, సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్ల వాదనలతో ఏకీభవించింది. సిట్ను క్వాష్ చేయడంతో పాటు కేసును సీబీఐకి అప్పగించాలంటూ తీర్పు వెలువరించింది.

Leave a Reply

%d