వీ6, వెలుగును బ్యాన్ చేస్తం – కేటీఆర్

వీ6 న్యూస్ చానెల్, వెలుగు పత్రికపై విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందిస్తూ.. ప్రత్యేకంగా వీ6, వెలుగు పత్రికలపై అసహనాన్ని వ్యక్తం చేశారు. మద్య నిషేధం ఉన్న గుజరాత్ లో లిక్కర్ తాగి 42 మంది చనిపోతే.. దాన్ని స్కాం అంటామా.. స్కీమ్ అంటామా.. మీ వీ6లో చూపించారా? అంటూ చానెల్ ప్రతినిధిని ప్రశ్నించారు. వీ6లో ఏం చూపిస్తారో తెలుసు.. ఏం మాట్లాడతారో తెలుసు.. ఏం డ్రామాలు చేస్తారో మాకు తెలుసు.. ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు అంటూ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. బీజేపీకి మౌత్ పీస్ లా ఉన్న చిల్లర చానెల్స్ అంటూ కొన్ని ఛానెల్స్ పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజల్లో ఆ చానెల్స్ ను ప్రజల ముందు ఎండగడతాం అంటూనే.. వీ6 న్యూస్ చానెల్, వెలుగు పత్రికను కేటీఆర్ ప్రస్తావించారు. బీజేపీ ఆఫీసులో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేను బ్యాన్ చేశారని.. మేం కూడా ఎందుకు బ్యాన్ చేయకూడదంటూ ఎదురుదాడికి దిగారు. బీజేపీ అడించినట్లు కొన్ని పత్రికలు, టీవీలు ఆడుతున్నాయని.. బీబీసీపైనే దాడి చేసినోళ్లు.. దేశంలోని ఈ మీడియా ఎంత అన్నారు.. వాస్తవాలను చూపేట్టే సత్తా మీకు లేకపోవచ్చు కానీ.. మాకు ఉందని.. ప్రజల ముందు నగ్నంగా ఈ విషయాలను ఎండగడతామన్నారు.

Leave a Reply

%d