కాంగ్రెస్ ట్విస్ట్ తో కమలానికి, కారుకు షాక్

దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పాగా వేయడానికి నానా కష్టాలు పడుతోంది. ఇటీవల కర్నాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్నప్పటికీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు  తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాగైన అధికారంలోకి రావాలని కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుంజుకోవడంతో ఇటు కేసీఆర్ కి, అటు బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇందు ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ లిక్కర్ స్కాం విషయంలో కవిత అరెస్ట్ విషయం చాలా దెబ్బతీసిందనే చెప్పుకోవాలి. మరోవైైపు కారులో పార్టీలో నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టడంతో కేసీఆర్ కుదుటపడటం లేదు. గతంలో భాజపా టార్గెట్ అనుకున్నప్పటికీ… ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి సీన్ లోకి రావడం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.

 

 

Leave a Reply

%d